Mobile Popup Ad
Mobile Popup Ad

పోల‌వ‌రం ప్రాజెక్ట్‌లో కీల‌క ఘ‌ట్టం పూర్తి.. అధికారుల‌కు సీఎం అభినంద‌న‌లు

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీలో ప్ర‌తిష్టాత్మ‌క పోల‌వ‌రం ప్రాజెక్ట్‌ (Polavaram Project)లో కీల‌క ఘ‌ట్టం పూర్త‌యిన‌ట్లు సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu) ఎక్స్‌వేదిక‌గా వెల్ల‌డించారు.  ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల పొడవైన ‘డయాఫ్రం వాల్’ నిర్మాణం నేడు పూర్త‌య్యింద‌ని సీఎం తెలిపారు. అతి తక్కువ సమయంలోనే డ‌యాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజనీర్లను సీఎం అభినందించారు. దీనికి సహకరించిన కేంద్ర సంస్థలకు, పోలవరం ప్రాజెక్టు అధారిటీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి జీవనాడి అయిన‌ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వ సంకల్పంలో ప‌ని చేస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు.

గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.1000 కోట్లు వెచ్చించి నిర్మించిన‌ట్లు చెప్పారు. డయాఫ్రమ్ వాల్ పూర్తి కావడంతో ప్రధాన కట్టడమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ECRF) డ్యామ్ పనులు వేగవంతం అవుతాయ‌ని సీఎం (CM Chandrababu) తెలిపారు. ఇప్పటికే ప్రకటించినట్లు అన్ని పనులు పూర్తి చేసి 2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తామ‌ని మ‌రోసారి గుర్తు చేశారు.

Read Also: మిల్లెట్ మసాలా కిచిడీ.. రుచితో పాటు ఆరోగ్యం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>