కరీంనగర్ డంప్‌యార్డ్‌ను వెంటనే తరలించండి: టీఆర్ఎస్ డిమాండ్

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) నగర ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని బైపాస్‌ రోడ్డులో ఉన్న డంప్‌యార్డ్‌ను అక్కడి నుండి ఎత్తివేసి నగరానికి దూరంగా తరలించాలని.. అక్కడ కూడ శాస్త్రీయ పద్ధతులతో వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ నియోజకవర్గ ‌ఇంచార్జ్ అంకం శివరాణి ఆద్వర్యంలో ప్రజలకు ఇబ్బందికరంగా మారినా డంపింగ్ యార్డ్ బైపాస్ రోడ్డు నుండి కరీంనగర్ ‌నగరానికి దూరంగా తరలించాలని పార్టీ శ్రేణులు డంపింగ్ యార్డ్ వద్ద ధర్నా చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ.. కరీంనగర్ నగరంలో ఉన్న డంప్‌యార్డ్‌లో సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్త కారణంగా దుర్వాసన, పొగ, దుమ్ము, ఇతర పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయని, కోతిరాంపూర్, లక్ష్మినగర్, కట్ట రాంపూర్, కొత్త యాస్వడ, కమాన్ ప్రాంతం, బస్టాండ్, అంబేద్కర్ స్టేడియం ఇలా సగం నగరం అంతా పొగతో, దుమ్ముతో కరీంనగర్ ప్రజలు తీవ్రమైన అరోగ్య ఇబ్బందులు పడుతున్నారని గుంజపడుగు హరిప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

కరీంనగర్ నగరంలో నివాస ప్రాంతాలకు సమీపంలో పెద్దఎత్తున వ్యర్థాలతో పేరుకుపోవడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెప్పారు. అయితే ఇప్పటికే డంప్‌యార్డ్‌ను తరలించే అంశంపై సాక్షాత్తూ కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ కట్టర్, బండి సంజయ్, కరీంనగర్ మేయర్ అందరూ మాట ఇచ్చి తప్పరని వారు అన్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా డంపింగ్ యార్డ్ ను స్మార్ట్ డంప్ యార్డ్ గా మారుస్తామని చెప్పిన నగర పాలక సంస్థ పాలకుల మాటలు బూటాకం అని తేలిపోయిందని విమర్శించారు.

ప్రభుత్వం కరీంనగర్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైన యుద్ద ప్రాతిపాదికన డంప్‌యార్డ్‌ను నగరానికి దూరంగా తరలించి బయోమైనింగ్ ద్వారా చెత్తను పూర్తిగా తొలగించాలని, అలాగే భవిష్యత్తులో నగరంలో చెత్త పేరుకుపోకుండా తడి, పొడి వ్యర్థాలను వార్డ్ స్థాయిలోనే వేరు చేసి, శాస్త్రీయంగా ప్రాసెసింగ్ చేసే శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ రక్షణ సేన‌ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, జిల్లా అదివాసి విభాగం అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేష్, జిల్లా సీనియర్ రంగరవేణి లక్ష్మణ్, బుడిగె పర్షారం గౌడ్, నూతి చరణ్,‌ బాసవేణి రాజేందర్, యండి రజీ, పుసాల పవన్, కొత్తూరి రఘు, యండి హుస్సేన్, మడిపల్లి వినీత్, అభిరామ్, గర్షకుర్తి విద్యాసాగర్, గుంజపడుగు పవన్, సుత్తాల రాజన్నా, మహిళ విభాగం నాయకురాలు యండి సల్మా, దాసరి అంజలి, దీటి శిరీష రమేష్, కొరిమి పద్మ, కొలిపాక గౌతమి, కాంతాల రోజా రెడ్డి, కుతాడి రజిత, వరుణ్ యదవ్, గడ్డం రవికుమార్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>