ఒక్క సినిమా ఛాన్స్ ప్లీజ్ అన్నాడు.. అంతలోనే ప్రాణాలు కోల్పోయాడు!

కలం, వెబ్ డెస్క్: సినిమా (Cinema) కల కోసం ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ స్టూడియోలు చుట్టే తిరిగేవారెందరో. వెండితెరపై ఒక్క సీన్‌లోనైనా కనిపించాలని తాపత్రాయపడే కుర్రాళ్లు ఎందరో. ఒటీటీలు వచ్చినా.. సినిమాల నిర్మాణం పెరిగినా చాలామందికి అవకాశాలు దక్కడం లేదు. నేటికీ ఛాన్స్ ప్లీజ్ అంటూనే డైరెక్టర్లు, నిర్మాతల చుట్టుూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో వెండితెరపై మెరవాలన్న తన కలలను నిజం చేసుకునేందుకు హైదరాబాద్ వచ్చిన ఓ యువ కళాకారుడి కథ విషాదాంతమైంది.

వివరాల్లోకి వెళ్తే.. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సంజయ్ అనే యువకుడు విద్యానగర్‌లో ఉంటూ ఆడిషన్స్ ఇస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ (Hyderabad) బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని ఒక సినిమా ఆఫీసుకు వెళ్లగా, అప్పటికే ఆడిషన్స్ పూర్తయ్యాయని నిర్వాహకులు తెలిపారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఎంతగానో వేడుకున్నాడు. సాధ్యం కాదని చెప్పేశారు. ఆడిషన్ ఇచ్చే ఛాన్స్ లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన సంజయ్.. అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్న కొద్దిసేపటికే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే కళాకారుడు మృతి చెందడంతో విషాద ఛాయలు అలముకున్నాయి.

Read Also: హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి ఇంట్రెస్టింగ్ వీడియో

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>