కలం వెబ్ డెస్క్ : తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Konda Surekha)కు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు(Nampally Court) నేడు సమన్లు(Summons) జారీ చేసింది. జనవరి 12న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సినీ నటుడు నాగార్జున(Nagarjuna), కొండా సురేఖపై వేసిన పరువు నష్టం కేసు విచారణలో భాగంగా కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. పరువు నష్టం పిటిషన్‌ను కాగ్నిజెన్స్‌లోకి తీసుకున్న ప్రజాప్రతినిధుల కోర్టు విచారణలో ముందుకెళ్తోంది.
నాగార్జున తనయుడు నాగ చైతన్య, సినీ నటి సమంతల విడాకులపై కొండా సురేఖ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో నాగార్జున కుటుంబం కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు. ఆ తర్వాత కొండా సురేఖ(Konda Surekha) నాగార్జునకు బహిరంగ క్షమాపణలు చెప్పడంతో నాగార్జున తన కేసును ఉపసంహరించుకున్నారు. కానీ, నాంపల్లి కోర్టును అధికారికంగా తీసుకొని విచారణ చేపట్టింది.
Read Also: ఆ పాపంలో నాకు కూడా భాగం ఉంది -కవిత
Follow Us On: Youtube


