కలం వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో ఓ కీలక పెన్ డ్రైవ్(Pen Drive)ను సిట్(SIT) అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ పెన్ డ్రైవ్‌లో వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిట్ విచారణ మొత్తం పెన్ డ్రైవ్ చుట్టూనే కొనసాగుతోంది. ప్రభాకర్ రావు(Prabhakar Rao) ఎస్ఐబీ(SIB) చీఫ్‌గా పని చేస్తున్నప్పుడే సదరు పెన్ డ్రైవ్‌లో ఫోన్ ట్యాపింగ్ జరిగిన వందలాది నెంబర్లు, వాయిస్ రికార్డింగులు భద్రపరిచినట్లు తేలింది. ఇందులో రాజకీయ నేతలతో పాటు, సినీ, వ్యాపార ప్రముఖుల వివరాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: హిందువులు కూడా నలుగుర్ని కనాలి -నవనీత్ కౌర్
Follow Us On: Pinterest


