కలం వెబ్ డెస్క్ : వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi).. పేరుకు పరిచయం అక్కర్లేదు. వయసు 14 సంవత్సరాలే అయినా క్రికెట్ ప్రపంచమంతా ఈ బుడ్డోడి గురించే చర్చ. వైభవ్ క్రీజ్‌లోకి వచ్చాడంటే బౌండరీల మోత మోగిపోవడం ఖాయం. తాజాగా విజయ్ హజారీ ట్రోఫీ(Vijay Hazare Trophy)లో కూడా బీహార్ తరఫున 36 బంతుల్లో సెంచరీ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఈ రేంజ్ దూకుడు ఆటతీరు చూపించినా వైభవ్‌కు విమర్శలు మాత్రం తప్పడం లేదు. అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో పాక్ చేతిలో చిత్తవడమే ఇందుకు కారణం. ఇంత పోటుగాడు పాక్ ముందు పిల్లి అయిపోయాడంటూ కొందరు నెటిజన్లు చురకలంటిస్తున్నారు.
“దేశవాళీ క్రికెట్‌లో రికార్డులు కొడుతున్నాడు కానీ పాకిస్థాన్ లాంటి జట్టు ముందు తడబడ్డాడు”, “ఇంత హైప్ ఎందుకు?”, “పాక్ ముందు నిలబడలేకపోయాడు” అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. పెద్ద మ్యాచ్‌లలో సత్తా చాటలేకపోతే ఈ రికార్డులకు విలువ ఏముంటుందన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
మరోవైపు, కొంతమంది క్రికెట్ అభిమానులు మాత్రం వైభవ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఇంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని, ఒక్క మ్యాచ్ ఆధారంగా ఒక యువ ఆటగాడిని జడ్జ్ చేయడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విమర్శలే అతడిని మరింత గొప్ప ఆటగాడిగా తీర్చిదిద్దుతాయని, భవిష్యత్తులో పెద్ద మ్యాచ్‌ల్లో వైభవ్(Vaibhav Suryavanshi) తన బ్యాటుతోనే సమాధానం చెబుతాడని అంటున్నారు.
Read Also: ఫస్ట్ మ్యాచ్‌లోనే ఉతికారేసిన వైభవ్.. రికార్డ్ సృష్టించాడు..
Follow Us On: X(Twitter)


