ఏప్రిల్ 1 నుంచి ఈ-ఆఫీస్ ద్వారా ఫైళ్ల నిర్వహణ : కలెక్టర్ బి.చంద్రశేఖర్

కలం, నల్లగొండ బ్యూరో : ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ – ఆఫీస్ ద్వారా మాత్రమే ఫైళ్లను నిర్వహించాలని నల్లగొండ (Nalgonda) జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ (Collector Chandrashekar) అధికారులను ఆదేశించారు. ఈ – ఆఫీస్ ద్వారా ఫైళ్ల నిర్వహణపై ఇదివరకే జిల్లా అధికారులు, వారి సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. అధికారులందరూ ఈ – ఆఫీస్ ద్వారా మాత్రమే ఫైళ్ల నిర్వహణకు సంసిద్ధం కావాలన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం అధికారులతో వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సందర్భంగా ఏప్రిల్ 2న గ్రామసభలు నిర్వహించాలని, అలాగే మున్సిపాలిటీలలో మున్సిపల్ వార్డు సభలు నిర్వహించాలని సూచించారు.

ప్రభుత్వం జారీ చేసే సూచనల ప్రకారం గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని చెప్పారు. వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధి దారుల వివరాలను గ్రామసభలలో చదివి వినిపించాలని, గ్రామసభల్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఫోటోలు, వీడియోలతో ప్రజెంటేషన్ ఇవ్వాలని సూచించారు. ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు సమావేశాల మినిట్స్‌ను సక్రమంగా నమోదు చేయాలన్నారు. ప్రజా పాలన పరిధిలోకి రాని పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను ప్రజలకు తెలిసేలా ప్రదర్శించాలన్నారు. గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా వారీగా జాబితా రూపొందించి వెంటనే సీపీఓకు సమర్పించాలని ఆదేశించారు.

అలాగే ఈ – వేస్ట్ నిర్వహణ వివరాలు ఇవ్వాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు వారి మండలాలలో టెన్త్ పూర్తిచేసిన విద్యార్థులు ఎట్టి పరిస్థితులలో ఖాళీగా ఉండరాదని, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో తప్పనిసరిగా చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ (Collector Chandrashekar) అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఆడపిల్లలు చదువు మధ్యలో నిలిపి పెళ్లిళ్ల వైపు వెళ్లకుండా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి , చండూర్ ఆర్డీవో శ్రీదేవి, దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, జిల్లా అధికారులు హాజరయ్యారు.

Read Also: కాంట్రవర్సీ కౌశిక్​.. ఫ్యూచర్ ఏంటి?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>