వైభవంగా సార్గమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ఠాపన.. ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు!

కలం, జగిత్యాల : జగిత్యాల రూరల్ మండలం హైదర్‌పల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన సార్గమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) హాజరై అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరిపై అమ్మవార్ల కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. హైదర్‌పల్లి గ్రామం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దారుకోట చందు, ఉపసర్పంచ్ పర్స వెంకటి, డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య, సమిండ్ల శ్రీనివాస్, కౌన్సిలర్ కూతురు రాజేష్, మాజీ ఉపసర్పంచ్ గంగాధర్, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>