ఆహార కల్తీపై ఉక్కుపాదం.. నెల రోజుల్లో 61 కేసులు, 15 టన్నుల పదార్థాల సీజ్

కలం, వెబ్ డెస్క్: కల్తీ ఆహార నివారణే లక్ష్యంగా ఫుడ్ సేఫ్టీ (Food Safety) అధికారులు చేస్తున్న దాడులు మంచి ఫలితాలను ఇస్తోంది. గడచిన నెల రోజుల్లోనే హైదరాబాద్ వ్యాప్తంగా (Hyderabad) వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో మొత్తం 61 కేసులు నమోదయ్యాయి. సుమారు 15 టన్నుల కల్తీ పదార్థాలను (Adulterated Food) సీజ్ చేశారు. ఈ అక్రమాలకు పాల్పడుతున్న 64 మంది నిందితులను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. అక్రమార్జన కోసం సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధికారులు తేల్చి చెప్తున్నారు. సురక్షితమైన ఆహారం ప్రతి పౌరుడికి అందే వరకు దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఆహార కల్తీని (Adulterated Food) సమాజంపై ఘోరమైన దాడిగా పరిగణిస్తూ, కల్తీ ముఠాల ఆటకట్టించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వినూత్న చర్యలు చేపట్టింది. పసిబిడ్డలు తినే బిస్కెట్లు, ఐస్ క్రీమ్ నుంచి నిత్యావసరాలైన పాలు, పెరుగు, టీ పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకు ప్రతి వస్తువులోనూ విషం నింపుతున్న అక్రమార్కులపై H-FAST (Hyderabad Food Analysis and Safety Team) బృందం ఉక్కుపాదం మోపుతోంది. ఈ మేరకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. ప్రజారోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విస్తృత దాడులు కొనసాగుతాయన్నారు. కల్తీ రహిత సమాజం కోసం ముమ్మర దాడులు జరుగుతాయని ఆయన హెచ్చరించారు.

Read Also: ఆయుధాలను వీడకుంటే అంతుచూస్తాం : అమిత్​ షా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>