మహబూబాబాద్ జిల్లాలో పసిబాలుడు అదృశ్యం

కలం, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో నాలుగు నెలల పసిబాబు అదృశ్యం చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రులే డబ్బుల కోసం విక్రయించారంటూ స్థానికులు ఆరోపిస్తుంటే.. చనిపోయాడంటూ తల్లిదండ్రులు ప్రచారం చేస్తున్నారు. మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం (Kommugudem) గ్రామపంచాయతీ పరిధిలోని ఓ తండాకు చెందిన మహిళ జులై 12న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. నాలుగు నెలలు గడిచినా బాబు కనిపించకపోవడంతో స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి.

బాబు మృతిచెందాడని తల్లిదండ్రులు చెబుతూ వస్తున్నారు. అనుమానించిన స్థానికులు విక్రయించి ఉంటారనే అనుమానంతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో శాఖ అధికారులు తల్లిదండ్రులను విచారిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. విక్రయం జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులైన తల్లిదండ్రులతో పాటు కొనుగోలుదారులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>