యువ‌కుల వేధింపులు.. క్రీడాకారిణి సూసైడ్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: వికారాబాద్ (Vikarabad) జిల్లాలో విషాద‌క‌ర‌ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బీసీసీఐ అండర్‌-19 క్రికెట్‌ జట్టుకు ఎంపికైన 17 ఏళ్ల యువ క్రీడాకారిణి నందిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యాలాల మండలం సంగయ్యపల్లికి చెందిన నందిని, వికారాబాద్‌లోని మధు కాలనీలో ఉన్న అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. చ‌దువుతో పాటు క్రికెట్‌లో కూడా ట్రైనింగ్ తీసుకుంటోంది. తన ప్రతిభతో అండర్‌-19 జట్టుకు ఎంపికై ఉన్నత స్థాయికి ఎదుగుతోంది. ఈ క్ర‌మంలో అనిల్ అనే యువకుడు ప్రేమ పేరుతో కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. కృష్ణ అనే మరో యువకుడు అతనికి సహకరిస్తున్నాడు. వీరిద్దరి వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన నందిని ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

ఈ ఘటనతో నందిని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. స్థానికులు ఈ ఘ‌ట‌న ప‌ట్ల‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నందిని మృతికి కారణమైన అనిల్, కృష్ణలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేర‌కు నందిని కుటుంబ సభ్యులు, బంధువులు వికారాబాద్‌ పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసన కారణంగా కొద్దిసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. భవిష్యత్తులో దేశం తరఫున ఆడాలని ఎంతో ఆశతో ఉన్న యువ క్రికెటర్‌ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం పట్ల స్థానికులు ఆవేద‌న‌ వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>