కలం, వెబ్ డెస్క్ : పవిత్రమైన తిరుమలను వైసీపీ అపవిత్రం చేసిందని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu) అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సభలో పాల్గొన్న ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. లడ్డూలో కెమికల్స్ కలిపిన చరిత్ర వైసీపీదని మండిపడ్డారు. వైసీపీ పాలనలో హిందుమతాన్ని అణగదొక్కాలనే కుట్ర జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో తొలిసారి మతాన్ని నాశనం చేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. హిందువుల మనోభావాలతో ఆటలాడుకునే వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు.
జనసేన(JSP), టీడీపీ(TDP), బీజేపీ(BJP) కలిసి ఉన్నంతవరకు వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ధీమా వ్యక్తం చేశారు. రాబోయేది కూడా కూటమి ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్ష వైసీపీ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ నాయకుల బెదిరింపులకు బెదరబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం 11 సీట్లతో ఉన్న వైసీపీ రాబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే పరిమితం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కాగా, 2024 ఎన్న్నికల్లో తమ అధినేత పవన్ కళ్యాణ్ రిస్క్ తీసుకోలేదని అన్నారు. పవన్ వీడిగా పోటీ చేసి ఉంటే 70 సీట్లు వచ్చేవని చెప్పారు. ఏపీ శ్రేయస్సు కోసం పవన్ 50 స్థానాలు వదులుకున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం వృథా కాలేదని వెల్లడించారు. ఫలితంగా ఇవాళ ఏపీ గ్రామీణ ప్రాంతాలు నాణ్యమైన రోడ్లతో కళకళలాడుతున్నాయని నాగబాబు (Nagababu) అభివర్ణించారు.
Read Also: గిరిజనుల హక్కులకు భంగం కలగనివ్వను : పవన్ కళ్యాణ్
Follow Us On: Facebook

