వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేస్తా : అంబటి రాంబాబు

కలం, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) పేరు ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు-2 నుంచి పోటీ చేస్తానని తెలిపారు. తాను ఎన్నడూ ఏ కులాన్ని తిట్టలేదని.. కావాలనే తనను తప్పుగా ప్రచారం చేశారంటూ మండిపడ్డారు అంబటి రాంబాబు. తాను సీఎం చంద్రబాబును తిడితే కమ్మవారిని మొత్తం తిట్టానంటూ కావాలనే తప్పుగా ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు.

సీఎం చంద్రబాబును (Chandrababu) తిడితే కమ్మవారంతా బాధపడ్డారని అంటున్నారని.. మరి తనను వేధిస్తే కాపులను వేధించినట్టు కాదా అని అంబటి (Ambati Rambabu) సీరియస్ అయ్యారు. తన మీద దాడి చేస్తే పోలీసులు నిలబడి చూశారని.. ఇలాంటి విధ్వంసాన్ని ఎప్పుడూ చూడలేదంటూ మండిపడ్డారు. తన రాజకీయ వారసత్వంపై ఇప్పుడే ఎలాంటి చర్చ అవసరం లేదని.. తాను ఇంకా పూర్తి స్థాయి యాక్టివ్ పాలిటిక్స్ లోనే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని.. అందుకు తామేం చేయాలో అన్నీ చేస్తున్నట్టు వివరించారు.

Read Also: తిరుమలను వైసీపీ అపవిత్రం చేసింది : నాగబాబు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>