మొంథా తుఫాను(Cyclone Montha) ప్రభావాన్ని ఎదుర్కోవడం కోసం ఏపీ సర్కార్ సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే 12 జిల్లాల్లో పౌర సరఫరాల శాఖ తరుపున అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) తెలిపారు. రాష్ట్రంలో 14,145 రేషన్ డిపోలు ద్వారా 7 లక్షలు రేషన్ కార్డు కుటుంబాలకు నిత్యా వసర సరుకులు పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో సోమవారం రాష్ట్రంలో ‘మొంథా’ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలుపై మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను వివరించారు. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనతో రాష్ట్రంలో ‘మొంథా’ తుఫాను ప్రభావిత 12 జిల్లాలు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి మొత్తం 12 జిల్లాలో యుద్ధప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ జిల్లాల్లో 14,145 రేషన్ డిపోలు ద్వారా 7 లక్షలు కార్డు దారులు కుటుంబాలకు నిత్యవసర సరుకులు సబ్సిడీ రూపంలో రేపు ఉదయం 9:00 గంటలు నుండి అందిస్తున్నాం. మొంథా తుపాను ముందస్తు చర్యల్లో భాగంగా ఏలూరు జిల్లాలో టార్పాలిన్లు రైతు సేవా కేంద్రాల్లో ఉంచాం. వాటిని రైతులు వాడుకోవచ్చు. ఏ ఒక్క రైతు ఇబ్బందులు పడకూడదన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం’’ అని తెలిపారు.
‘‘తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో 626 వివిధ కంపెనీల బంకులలో 35,443 లీటర్లు డీజిల్ ఆయిల్, పెట్రోల్ అదనంగా నిల్వలను అందుబాటులో ఉంచి, కొరత లేకుండా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న 1,500 మిల్లులను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేసినట్లు ఆయన తెలిపారు. రైతులు నుంచి తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు ఇబ్బందులకు గురి చేయకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇప్పటికే కోత కోసిన వరి ధాన్యం వ్యవసాయ అధికారుల సహకారంతో పౌరసరఫరాల సంస్థ మేనేజర్లు మిల్లులకు తరలించేందుకు చర్యలు చేపట్టాం’’ అని నాదెండ్ల(Nadendla Manohar) పేర్కొన్నారు.
Read Also: కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం..

