జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నిక ముందు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం(Chinna Srisailam Yadav) యాదవ్‌కు భారీ షాక్ తగిలింది. ఉపఎన్నిక నేపథ్యంలో పలువురు రౌడీ షీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. వారిలో నవీన్ తండ్రి శ్రీశైలం యాదవ్ కూడా ఉన్నారు. ఆయనతో పాటు మరో వంద మంది రౌడీ షీటర్ల బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మధురా నగర్ పీఎస్‌లో చిన్న శ్రీశైలం యాదవ్, అతడి సోదరుడు రమేష్ యాదవ్‌తో సహా 19 మంది.. బోరబండ పీఎస్‌లో 74 మంది రౌడీ షీటర్ల బైండోవర్ చేశారు.
ఎన్నికల(Jubilee Hills Bypoll) వేళ రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెట్టడంలో భాగంగానే బైండోవర్లు చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న పలువురు రౌడీ షీటర్లపైనా చర్యలు తీసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనతో కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

