ఆంధ్రప్రదేశ్ ప్రకాశం(Prakasam) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. మానవ మృగంలా మారాడు. 12ఏళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొండపి(Kondapi) మండలంలో చోటు చేసుకుంది. ఫుల్‌గా మద్యం తాగి వచ్చిన తండ్రి.. తన కాంమ వాంఛకు కన్న కూతురిని బలి చేశాడు. ఉదయం కడుపు నొప్పి వస్తుందని బాలిక చెప్పడంతో ఆసుపత్రి తీసుకెళ్లగా అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు.. బాలికపై జరిగిన అఘాయిత్యాన్ని నిర్ధారించారు. దీంతో బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

