కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం వెంటనే రూ.15 వేల కోట్ల ఫీజు రీ ఎంబర్స్ మెంట్ (Fee Reimbursement) బకాయిలు విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు (Ramchander Rao) వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్లో ‘ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’ పేరిట చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందన్నారు. విద్యా శాఖను తన వద్దకు ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. కనీసం విద్యార్థుల సమస్యలను వినిపించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు ప్రకటించారని, ఆరు నెలలైపోతున్నా రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు.
ఫీజులు కట్టాలని ఒత్తిడి..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన బకాయిలను ఇంతవరకు క్లియర్ చేయలేదని రాంచందర్ రావు (Ramchander Rao) విమర్శించారు. దీంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కాలేజీలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో సిబ్బందికి జీతాలు చెల్లించలేక.. ఫీజులు కట్టాలని విద్యార్థులనే ఒత్తిడి చేస్తున్నాయని వివరించారు. పై చదువులకు వెళ్దామంటే సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా యువత భవిష్యత్తు గందరగోళంలో పడిందన్నారు. ఫీజు బకాయిలు విడుదల చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటామన్నారు.
Also Read : కొండా సురేఖపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

