కలం, వెబ్ డెస్క్: మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అంశంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తొలిసారి స్పందించారు. ‘పార్టీ అంతర్గత వ్యవహారాలను బయట ప్రస్తావించదల్చుకోలేదు. ఎవరైనా అధిష్ఠాన నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. సురేఖ అంశం పార్టీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది. ఊహాజనిత కథనాలు ప్రచారం చేయొద్దు. ఏఐసీసీ నిర్ణయమే ఈ విషయంలో అంతిమం’ అని స్పష్టం చేశారు.

