Mobile Popup Ad
Mobile Popup Ad

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 84 శాతం పోలింగ్

కలం, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో బుధవారం జరిగిన పోలింగ్ చెదురు ముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 12 మున్సిపాలిటీల లోని 260 వార్డులకు గాను 1073 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఉదయం 7 గంటలకు మందకొడిగా ప్రారంభమై పోలింగ్ మధ్యాహ్నం సమయానికి పుంజుకుంది. ఉమ్మడి జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగిసే సమయానికి 84 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మహబూబాబాద్ పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రచారం నిర్వహిస్తున్నాడని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి దాడి చేశాడు.

భూపాలపల్లి (Bhupalpally) పట్టణంలోని ఓ పోలింగ్ కేంద్రం సమీపంలో బీఆర్ఎస్ అభ్యర్థి తరపున ఓ వ్యక్తి డబ్బులు పంచుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్దన్నపేట మున్సిపాలిటీ లోని డీసీ తండా లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల పై జనం తిరగబడ్డారు.
ఉమ్మడి (Warangal) జిల్లాలోని మున్సిపాలిటీల్లో నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ములుగులో 80.41 శాతం, పరకాలలో 80.16, స్టేషన్ ఘనపూర్ లో 84.47, జనగామలో 70.06, వర్ధన్నపేట లో 86.23, నర్సంపేటలో 85.21, భూపాల పల్లిలో 65.18, తొర్రూరులో 77.99, డోర్నకల్ లో 81 35, మరిపెడలో 85.76, మహబూబాబాద్ లో 75.60, కే సముద్రంలో 86.14 పోలింగ్ శాతం నమోదైంది.

Read Also: ట్రేడ్​ డీల్​ : కొన్ని ఉత్పత్తులను తొలగించిన యూఎస్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>