కలం, డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు (Allu Arjun) 42 రూల్స్ ఉన్నాయని ప్రముఖ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువా చెప్పిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను బన్నీ టీమ్ తీవ్ర స్థాయిలో తప్పుబట్టింది. ఇదే సమయంలో 42 రూల్స్ ఇవే అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్టు వైరల్ అవుతోంది. అందులో బన్నీని డామినేట్ చేసేలా కలర్ ఫుల్ డ్రెస్సులు వేసుకోవద్దు, 3 ఫీట్ల దూరం పాటించాలి, జేబుల్లో చేతులు పెట్టుకోవద్దు.. బన్నీ రాగానే అందరూ నిలబడాలి, వెళ్లిపోయేటప్పుడు తిరిగి చూడొద్దు.. ఇలా ఎన్నో ఉన్నాయి. వాటిపై రకరకాల ట్రోల్స్, మీమ్స్ వస్తున్నాయి.
ఈ లిస్టు వివాదంపై తాజాగా బన్నీ టీమ్ రియాక్ట్ అయింది. ఆ లిస్టు పూర్తిగా తప్పు అని ఖండించింది. ఆ లిస్టును సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిని గుర్తించామని.. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించింది. అల్లు అర్జున్ (Allu Arjun) పై వస్తున్న ఈ తప్పుడు ఆరోపణలను ఎవరూ నమ్మొద్దని.. ఆయన అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని బన్నీ టీమ్ స్పష్టం చేసింది. కావేరీ బారువా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం అని.. ఆమె మీద పరువు నష్టం దావా వేస్తామని ఇప్పటికే బన్నీ టీమ్ తెలిపింది.
Read Also: ఈరోజే జీవితంలో తొలిసారి కెమెరా ముందు నిలబడ్డా : చిరంజీవి
Follow Us On: Pinterest


