epaper
Wednesday, February 18, 2026
epaper

ట్రేడ్​ డీల్​ : కొన్ని ఉత్పత్తులను తొలగించిన యూఎస్​

కలం, వెబ్​డెస్క్​: అమెరికాతో వాణిజ్య (India US Trade) ఒప్పందంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్​తో ట్రేడ్​ డీల్​కు సంబంధించి మంగళవారం అమెరికా విడుదల చేసిన ఫ్యాక్ట్​షీట్​లో స్పల్ప మార్పులు జరిగాయి. ఇందులో నుంచి కొన్ని రకాల పప్పులకు యూఎస్​ మినహాయింపు ఇచ్చింది. అలాగే 500 బిలియన్​ డాలర్ల అమెరికన్​ వస్తువులను భారత్​ దిగుమతి చేసుకోవాలనే అంశంలోనూ కొన్ని సవరణలు చేసింది.

భారత్​, యూఎస్​ ట్రేడ్​ డీల్​లోని ముఖ్యాంశాలతో ఫ్యాక్ట్​ షీట్​ను మంగళవారం వైట్​ హౌస్​ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఏముందంటే ‘అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కొన్ని రకాల ఇండస్ట్రియల్​ గూడ్స్​, ఆహార, వ్యవసాయ ఉత్పత్తులకు భారత్​ సుంకం తొలగిస్తుంది. లేదా క్రమంగా తగ్గించుకుంటూ పోతుంది. ఇందులో డ్రిల్డ్​ డిస్టిల్టర్స్​ గ్రెయిన్స్​(డీడీజీఎస్​), ఎర్ర జొన్నలు, ట్రీ నట్స్​(బాదం, పిస్తా, జీడి వంటివి), పండ్లు, సర్టెన్​ పల్సెస్​, సోయాబీన్​ ఆయిల్​, వైన్​, స్పిరిట్స్​, అదనపు ప్రొడక్ట్స్​ ఉన్నాయి’ అని పేర్కొంది.

అయితే, సవరించిన ఫ్యాక్ట్​షీట్​లో ‘సర్టెన్​ పల్సెస్​’ అనే పదాన్ని తీసేసింది. వాస్తవానికి ఈ విభాగంలోకి వచ్చే పప్పులు, శనగలు, చిక్కుడు, డ్రై బీన్స్​ వంటివి భారత్​లో విస్తారంగా పండుతాయి. అందువల్ల ఇండియాలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. అమెరికా నుంచి పప్పుధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతికి అనుమతి ఇవ్వడంతోపాటు సుంకం లేకుండా చేయడం భారత రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పార్లమెంట్​లోనూ, బయట ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ఈ క్రమంలో డీల్​కు సంబంధించి కొన్ని సవరణలతో అమెరికా విడుదల చేసిన రెండో ఫ్యాక్ట్​ షీట్​లో పల్సెస్​ను మినహాయించడం గమనార్హం.

వ్యవసాయ ఉత్పత్తులూ..

అలాగే మొదటి ఫ్యాక్ట్​ షీట్​లో 500 బిలియన్​ డాలర్ల విలువైన అమెరికన్​ ఉత్పత్తులు కొనడానికి భారత్​ అంగీకరించింది అని ఉంది. ఇందులో ఇంధనం, ఐటీ ప్రొడక్ట్స్​, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు, తదితరం ఉన్నాయి. దీనిలోనూ వైట్​హౌస్​ సవరణలు చేసింది. 500 బిలియన్​ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి ‘అంగీకరించింది’ అనే స్థానంలో ‘భావిస్తోంది’ అని మార్చింది. అలాగే, వ్యవసాయ ఉత్పత్తులను తీసేసింది. ఈ మార్పులను బట్టి కొన్ని రకాల పప్పులు, వ్యవసాయ ఉత్పత్తులు భారత్​కు దిగుమతి కావని తెలుస్తోంది. అయితే, మిగిలిన వాటిలో మాత్రం యూఎస్​ మార్పులు చేయలేదు.

కాగా, భారత్​ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. ఇప్పుడు అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటే భారత రైతుల ఉత్పత్తులకు మార్కెట్​ తగ్గుతుది. వ్యవసాయం కుదేలవుతుంది. అందువల్ల ఈ ట్రేడ్ (India US Trade) ​డీల్​పై భారత రైతుల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సవరించిన ఫ్యాక్ట్​షీట్​లో పప్పులు, వ్యవసాయ ఉత్పత్తులను తీసేయడం కొంత ఊరటనిచ్చేదే. అయితే, ట్రేడ్​ డీల్​ అమల్లోకి వచ్చేంతవరకు అమెరికాను ముఖ్యంగా ట్రంప్​ను నమ్మలేం అని విశ్లేషకులు అంటున్నారు.

Read Also: డాక్టర్​ శ్రీలీల.. ఎంబీబీఎస్​ పట్టా అందుకున్న నటి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>