వికసిత్‌ భారత్ కోసం వికసిత్‌ ఆంధ్ర ఆవశ్యకం: ఎంపీ లక్ష్మణ్‌

కలం, వెబ్ డెస్క్: వికసిత్‌ భారత్ సాకారం కోసం వికసిత్‌ ఆంధ్ర నిర్మాణం ఆవశ్యకమని రాజ్యసభలో బీజేపీ సభ్యుడు కె.లక్ష్మణ్‌ (MP Laxman) అన్నారు. అమరావతి చట్టబద్దత బిల్లుపై రాజ్యసభలో వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా సభలో లక్ష్మణ్‌ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఏపీ రాజధానిగా అమరావతి కోసం 29 వేలమంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని తెలిపారు. భవ్య రాజధాని సాకారం కోసం ఏపీ ప్రజలు కలలు కన్నారని చెప్పారు. దేశమంతా సుసంపన్నంగా ఉండేందుకు ప్రధాని మోదీ వికసిత్‌ భారత్‌ సంకల్పం తీసుకున్నారని చెప్పారు. వికసిత్‌ ఆంధ్రప్రదేశ్ కోసం వికసిత్‌ రాజధాని అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

రాజధాని కోసం సుదీర్ఘంగా పోరాడిన ఆంధ్రా మహిళలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. అమరావతి బిల్లు (Amaravati Bill) ఆమోదం కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోందని వ్యాఖ్యానించారు. ఘన చరిత్ర ఉన్న తెలుగుజాతికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. తెలుగు వారి కోసం ఆంధ్ర రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు పోరాడారని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేసినా నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించలేదని దుయ్యబట్టారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆంద్ర ప్రజల కల సాకారం అయినందుకు కె.లక్ష్మణ్‌ (MP Laxman) కృతజ్ఞత తెలిపారు.

Read Also: ఆటో ఎల్పీజీ సంక్షోభం.. బీజేపీ, కాంగ్రెస్ బ్లేమ్ గేమ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>