కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి (Amaravati)కి చట్టబద్ధ కల్పించే బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించిన సందర్భంగా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు. ఏపీ వ్యాప్తంగా ప్రజలంతా ఈ రోజు రాత్రి 7 గంటలకు ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో అమరావతి చట్టబద్ధతకు సహకరించిన నేతలకు, ప్రజలకు ఈ విధంగా కృతజ్ఞతలు తెలపాలని కోరారు. రాజధానికి పట్టిన గ్రహణం వీడిందని, ప్రజా రాజధాని ఎట్టకేలకు చట్టబద్దత వచ్చిందని లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ శుభ సందర్భంలో అందరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగించి ‘మన రాజధాని అమరావతి’కి దీపహారతులు ఇద్దాం.. అంటూ లోకేశ్ (Nara Lokesh) తన పోస్టులో రాసుకొచ్చారు. వెలిగించిన దీపంతో సెల్ఫీ తీసుకుని ఆ ఫోటోను #APThanksIndia హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలని సూచించారు. ప్రతి ఇంట్లో దీపం.. అమరావతి కోసం సంకల్పం అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.
Read Also: రాజ్యసభలో అమరావతి బిల్లు.. వైఎస్సార్‌సీపీ సభ్యుల వాకౌట్
Follow Us On: Instagram

