ఆటో ఎల్పీజీ సంక్షోభం.. బీజేపీ, కాంగ్రెస్ బ్లేమ్ గేమ్

కలం, తెలంగాణ బ్యూరో : ఇరాన్ యుద్ధం కారణంగా తెలంగాణలో ఆటో ఎల్పీజీ సంక్షోభం (Auto LPG Crisis) నెలకొన్నది. ఇప్పటికే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల షార్టేజీ కొనసాగుతున్నది. దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్లు కొన్ని వారాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు. అది కొలిక్కి రాకముందే ఆటోరిక్షాలకు ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై ప్రభావం పడింది. వేలాది ఆటోలు గ్యాస్ బంకుల దగ్గర క్యూ కట్టాయి. గ్యాస్ కొరతతో అవి రోడ్డెక్కడంలేదు. ఫలితంగా ఆటో రిక్షా డ్రైవర్లకు ఉపాధి తగ్గింది. చేయిదాటిపోయే పరిస్థితి నెలకొన్నదని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్రమే జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. మరోవైపు ఆ శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర్ రాష్ట్రంలో ఆటో ఎల్పీజీ సప్లై, డిమాండ్ గురించి పెట్రోలియం సంస్థల రీజినల్ అధికారులతో సమీక్షించారు. తదుపరి కార్యాచరణపై చర్చించారు. సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని నొక్కిచెప్పారు.

ప్రైవేటు గ్యాస్ కంపెనీల బంకుల్లో నో స్టాక్ :

రాష్ట్రంలో సుమారు లక్ష ఎల్పీజీ ఆటోలు తిరుగుతున్నాయని, గత కొన్ని వారాలుగా తగినంతగా ఎల్పీజీ సప్లై లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) మూడు రోజుల క్రితం పెట్రోలియం మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఒక రోజుకు సగటున 55 మిలియన్ లీడర్ల లిక్విడ్ గ్యాస్ అవసరమని, కానీ ఆ మేరకు సరఫరా లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరా కోసం మూడు ప్రభుత్వరంగ చమురు సంస్థలు 33 బంకులను నిర్వహిస్తున్నాయని, ప్రైవేటు సంస్థలు దాదాపు 110 బంకులను నడుపుడతున్నాయని గుర్తుచేశారు. మొత్తం ఆటో ఎల్పీజీ అవసరాల్లో ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కంపెనీలు కేవలం 20 శాతమే సరఫరా చేస్తున్నాయని, మిగిలిన 80% మేర సూపర్ గ్యాస్, గో గ్యాస్, యూనీ గ్యాస్, ప్రైమ్ గ్యాస్, ఎక్స్ ట్రా గ్యాస్, ఏజిస్ గ్యాస్, టోటల్ ఎనర్జీస్ తదితర ప్రైవేటు కంపెనీలే సప్లై చేస్తున్నాయని గుర్తుచేశారు.

ఎల్పీజీ సప్లై తగ్గిపోవడంతో సంక్షోభం :

ఆటో ఎల్పీజీని విక్రయిస్తున్న టోటల్ ఎనర్జీస్ అనే కంపెనీ దాదాపు 85% మేర గ్యాస్‌ను భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నది. కానీ ప్రభుత్వరంగ సంస్థల నుంచి ఒకవైపు కమర్షియల్ ఎల్పీజీ, మరోవైపు ఆటో ఎల్పీజీ సప్లై గణనీయంగా తగ్గిపోవడంతో టోటల్ ఎనర్జీస్‌కు విక్రయించడం కూడా బందయింది. దీంతో ఆ కంపెనీకి చెందిన నగరంలోని రీటెయిల్ ఔట్‌లెట్లలో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రైవేటు బంకులు ఇంతకాలం లీటర్ ధర రూ. 73గా ఉంటే ఇప్పుడు అది రూ. 93 మొదలు రూ. 110 వరకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. నియంత్రణ కరువవడంతో బంకుల యాజమాన్యం చెప్పిందే వేదం అనే ధోరణి కొనసాగుతున్నది. క్లీన్ ఎనర్జీ, కాలుష్య నివారణ కోసం ప్రభుత్వ ప్రోత్సాహంతో దాదాపు లక్ష ఆటోలు ఎల్పీజీవైపు మళ్లితే ఇప్పుడు ఇరాన్ యుద్ధ సంక్షోభంతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారు.

బీజేపీ, కాంగ్రెస్ మధ్య బ్లేమ్ గేమ్ స్టార్ట్ :

ఆటో డ్రైవర్లకు ఎల్పీజీ సప్లై (Auto LPG Crisis) లేకపోవడంతో దానిపై ఆధారపడే కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. పరిస్థితిని చక్కదిద్దాల్సిందిగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. కానీ దేశవ్యాప్తంగా పరిస్థితి పూర్తిగా గాడిన పడకపోవడంతో కేంద్రం కూడా చేతులెత్తేసే పరిస్థితి నెలకొన్నది. ఇదే పరిస్థితి ఇకపైనా కొనసాగి ఆటో డ్రైవర్లు రోడ్డెక్కితే పరిస్థితిని నియంత్రించడం రాష్ట్ర సర్కార్ వంతు అవుతుంది. కానీ ఎల్పీజీనీ సరఫరా చేయాల్సింది కేంద్రం కావడంతో ఆ నెపాన్ని బీజేపీపైకి (BJP) నెట్టడానికి కాంగ్రెస్‌కు అస్త్రం దొరికినట్లయింది. ఎల్పీజీ సంక్షోభం కాంగ్రెస్, బీజేపీల మధ్య పొలిటికల్ రంగు పులుముకుంటున్నది. కేంద్రం ఇవ్వనప్పుడు రాష్ట్రం మాత్రం ఎక్కడి నుంచి తెస్తుందని ప్రచారం చేసుకోడానికి కాంగ్రెస్‌కు (Congress) వెసులుబాటు ఉన్నది. ప్రత్యామ్నాయన్ని సూచించడంలో రాష్ట్రం విఫలమైందంటూ పొలిటికల్‌గా తిప్పికొట్టడానికి బీజేపీ రెడీ అవుతున్నది.

Read Also: ఎన్టీఆర్ టు కవిత.. నేతలందరిదీ అదే మాట..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>