జీఓ 60 రద్దు చేయాల్సిందే : వాహన యజమానుల నిరసన

కలం, నల్లగొండ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.60 వాహన యజమానుల పాలిట మరణశాసనంగా మారిందని, దానిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నల్లగొండ (Nalgonda) మాక్సి క్యాబ్ సీసీ బస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితరాజు రమేశ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వాహన యజమానులు గడియారం సెంటర్ వద్ద ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. రవాణా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్న డీజిల్ ధరలు, భారీగా ఉన్న టోల్ ఫీజులు, పన్నులతో సతమతమవుతున్న తమపై జీ.ఓ. 60 అదనపు భారాన్ని మోపుతోందని మండిపడ్డారు. దీనివల్ల ఒక్కో లారీపై వేల రూపాయల భారం పడుతుందని, కిరాయిలు లేక ఆదాయం పడిపోయి అప్పుల్లో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి ఆదాయం అందించడంలో ఎక్సైజ్ శాఖ తర్వాత రవాణా రంగమే రెండో స్థానంలో ఉందని, కోట్లాది రూపాయల పన్నులు కడుతున్నా, తమ సమస్యలను పట్టించుకునే నాథుడే లేడని వారు వాపోయారు. వాహనదారులపై భారం మోపుతున్న జీ.ఓ. 60ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, వాహనాల రిపేర్ల కోసం ప్రతిసారీ హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోందని, నల్లగొండలో వెంటనే ఆటోనగర్ నిర్మించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ (Nalgonda Collector) వెంటనే స్పందించి, వాహన యజమానులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే రవాణా బంద్ చేపడతామని వాహన యజమానులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు వాహన అసోసియేషన్ల సభ్యులు, డ్రైవర్లు, యజమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also: కాళేశ్వరంపై రాజ్యసభలో రగడ.. కిషన్ రెడ్డి VS సురేశ్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>