Mobile Popup Ad
Mobile Popup Ad

జైలు నుంచే ‘గోల్డ్’ స్కెచ్: చిక్కిన కిలాడీ దొంగ !

కలం, వెబ్‌ డెస్క్‌ : కరీంనగర్ లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యూవెలరీ చోరీ కేసులో కీలక మలుపు తిరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మోస్ట్ వాంటెడ్ బంగారు ఆభరణాల దొంగ సుబోధ్ సింగ్‌ను (Subodh Singh) కరీంనగర్ పోలీసులు ఎట్టకేలకు తమ అదుపులోకి తీసుకున్నారు. బీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఇతడిని పీటీ వారెంట్‌పై తెలంగాణకు తరలించారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరిచారు.

కటకటాల వెనుక నుంచే స్కెచ్..

సుబోధ్ సింగ్ (Subodh Singh) సాదాసీదా దొంగ కాదు. ఏడు రాష్ట్రాల్లో యాభైకి పైగా భారీ దోపిడీ కేసుల్లో ఇతడు ప్రధాన నిందితుడు. తన గ్యాంగ్‌తో కలిసి ఇప్పటివరకు ఏకంగా నాలుగు వందల కిలోల బంగారాన్ని కొల్లగొట్టాడు. అంతకంటే షాకింగ్ నిజం ఏమిటంటే.. ఇతడు జైల్లోనే కూర్చొని కరీంనగర్ దోపిడీకి పక్కా వ్యూహం రచించాడు. అనుచరుల ద్వారా పీఎంజే జ్యూవెలరీలో భారీ స్కెచ్‌ అమలు చేశాడు.

పోలీసుల గుప్పిట్లోకి డాన్..

గతంలో బీహార్ పోలీసులు అరెస్ట్ చేయడంతో సుబోధ్ ప్రస్తుతం అక్కడి జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నాడు. కరీంనగర్ కేసులో ఇతనే సూత్రధారి అని తేలడంతో తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి ఇక్కడికి తీసుకువచ్చారు. సుబోధ్ సింగ్‌ను కస్టడీకి తీసుకుని విచారించడం ద్వారా ఈ చోరీకి సంబంధించిన పూర్తి ముఠా వివరాలు, దాచిపెట్టిన బంగారం ఆచూకీ లభ్యమవుతుందని పోలీసులు భావిస్తున్నారు.

Read Also: తిరుమలలో భక్తుల రద్దీ.. 15 గంటలు పడుతున్న సర్వదర్శనం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>