Mobile Popup Ad
Mobile Popup Ad

అట్లాంటా ఫాల్కన్స్‌లో టువా టాగోవైలోఆకు కొత్త అవకాశం

కలం, వెబ్ డెస్క్ : ఎన్నో విమర్శల మధ్య టువా టాగోవైలోఆ (Tua Tagovailoa) మియామీ డాల్ఫిన్స్‌ను విడిచిన తర్వాత ఇప్పుడు కొత్త జట్టులో కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. అట్లాంటా ఫాల్కన్స్‌ (Atlanta Falcons) తరఫున చేరిన టువా, స్టార్టింగ్ క్వార్టర్‌బ్యాక్ స్థానానికి బలమైన పోటీదారుడిగా మారుతున్నాడు. గత నాలుగేళ్లలో మియామీ డాల్ఫిన్స్‌ జట్టును రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లినప్పటికీ, సూపర్ బౌల్ దాకా చేర్చలేకపోవడంతో టువాపై విమర్శలు పెరిగాయి. అనంతరం జట్టు యాజమాన్యం కీలక మార్పులు చేపట్టి హెడ్ కోచ్ మైక్ మెక్‌డానియల్, స్టార్ రిసీవర్లు టైరిక్ హిల్, జేలెన్ వాడిల్‌తో పాటు టువాను కూడా జట్టుకు దూరం చేసింది. ఆ తర్వాత టువా అట్లాంటా ఫాల్కన్స్‌లో కోచ్ కెవిన్ స్టెఫాన్స్కీ ఆధ్వర్యంలో చేరాడు. మొదట్లో అతను మైఖేల్ పెనిక్స్ జూనియర్‌తో స్టార్టింగ్ స్థానానికి పోటీ పడాల్సి వస్తుందని భావించారు. అయితే ప్రాక్టీస్ సెషన్లలో టువా ప్రదర్శన చూసిన తర్వాత పరిస్థితి మారుతోంది. అతనికే స్టార్టింగ్ అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన లూయిస్ రిడిక్ టువాకు మద్దతుగా నిలిచాడు. టువా వెనుకబడటానికి ప్రతిభ లోపం కారణం కాదని, ఫిట్‌నెస్ సమస్యలు, జట్టులోని పరిస్థితులే ప్రధాన కారణాలని చెప్పాడు. మియామీలో సరైన గేమ్ ప్లాన్ లేకపోవడం, ఆఫెన్సివ్ లైన్ బలహీనత, వైడ్ రిసీవర్ల గాయాలు అతని ఆటపై ప్రభావం చూపాయని వివరించాడు. అలాగే సరైన వాతావరణం లభిస్తే టువా స్టార్టింగ్ స్థానం దక్కించుకునే అవకాశాలు బలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. మైఖేల్ పెనిక్స్ జూనియర్‌ పై ఎలాంటి అనుమానం లేకపోయినా, టువా (Tua Tagovailoa) అద్భుతమైన పాసర్ అని పేర్కొన్నట్టు సమాచారం.

అయితే టువాకు 2025 సీజన్ అంత సులభంగా సాగలేదు. 14 మ్యాచ్‌ల తర్వాత కోచ్ మైక్ మెక్‌డానియల్ అతన్ని బెంచ్‌కు పరిమితం చేసి రూకీ క్వార్టర్‌బ్యాక్ క్విన్ ఇవర్స్‌ కు అవకాశం ఇచ్చాడు. ఆ సీజన్‌లో టువా 2,660 యార్డ్స్ సాధించి 20 టచ్‌డౌన్‌లు నమోదు చేశాడు. అయితే 15 ఇంటర్‌సెప్షన్లు కూడా చేయడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ కఠిన సీజన్ అనంతరం డాల్ఫిన్స్‌తో అతని ప్రయాణం ముగిసింది. ఇప్పుడు కొత్త జట్టులో కొత్త వాతావరణం టువా కెరీర్‌కు మళ్లీ ఊపిరి పోస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, 2025లో 8-9 రికార్డుతో ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయిన అట్లాంటా ఫాల్కన్స్‌ కూడా వచ్చే సీజన్‌లో మెరుగైన ఫలితాల కోసం ఎదురుచూస్తోంది.

Read Also: అరటి తొక్కతో చర్మానికి ఇంత మేలు జరుగుతుందా? షాకింగ్ బ్యూటీ టిప్స్

Read Also: పెట్రో బాదుడు పాపం తలా పిడికెడు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>