తిరుమలలో భక్తుల రద్దీ.. 15 గంటలు పడుతున్న సర్వదర్శనం

కలం, వెబ్ డెస్క్ :  తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో వెలుపల క్యూలైన్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు 15 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే  74,569 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

భారీ రద్దీ ఉన్నప్పటికీ భక్తులు సహనంతో దర్శనం పూర్తి చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా నిన్న 46,292 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.8 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా దర్శన సమయం ఎక్కువగా పడుతున్నప్పటికీ, టీటీడీ అధికారులు అన్ని క్యూలైన్లలో సజావుగా నిర్వహణ చేపడుతున్నారు. దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత ఉత్సాహంగా కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>