Mobile Popup Ad
Mobile Popup Ad

మోనాలిసా కేసులో ట్విస్ట్.. సెక్యూరిటీ కోసం కేరళ సీఎంకు లేఖ

కలం, వెబ్ డెస్క్ : కుంభమేళాలో వైరల్ అయిన మోనాలిసా (Monalisa) ఇటీవలే ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోవడం, అతడిపై పోక్సో కేసు నమోదు కావడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే, ఆమె మరోసారి వార్తల్లోకి వచ్చింది. తనకు సెక్యూరిటీ ఇవ్వాలని కోరుతూ కేరళ సీఎంకు లేఖ రాసింది. మధ్యప్రదేశ్ పోలీసులు తనను బలవంతంగా సొంతూరికి తీసుకెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తనకు 18 ఏళ్లు నిండాయని.. మేజర్‌నంటూ ఆ లేఖలో స్పష్టం చేసింది. మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్‌పై కొచ్చిలో పోక్సో కేసు నమోదు కాగా, వారి వాంగ్మూలాలు నమోదు చేసేందుకు మధ్యప్రదేశ్ పోలీసు బృందం అక్కడకు వచ్చింది. ఈ సమయంలోనే మోనాలిసా రక్షణ కోరుతూ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ జరిగింది..

తిరువనంతపురంలో మార్చి 11న మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ వివాహం జరిగింది. ఆమె వయస్సుపై వివాదం నెలకొనడంతో జాతీయ గిరిజన కమిషన్ విచారణ చేపట్టి.. ఇంకా మైనరేనని తేల్చింది. పోక్సో చట్టం ప్రకారం, మైనార్టీ తీరని అమ్మాయిని ఆమె (Monalisa) పూర్తి అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నప్పటికీ, అది చెల్లదు. దీంతో ఫర్మాన్ ఖాన్‌పై కొచ్చిలో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ క్రమంలోనే.. ఫర్మాన్ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో.. మే 20 వరకు ఆయన్ను అరెస్ట్ చేయొద్దని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

Read Also: ఆమెకు లైక్ కొట్టిన కోహ్లీ.. అంతా షాక్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>