Mobile Popup Ad
Mobile Popup Ad

పవన్ కళ్యాణ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలంటూ భారీ స్కామ్.. !

కలం, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేరిట ఫేక్ సిఫార్స్ లేఖలు తీవ్ర కలకలం సృష్టించింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ పేరును అడ్డుపెట్టుకుని కొందరు అక్రమార్కులు కొత్త దందాకు తెరలేపారు. నిరుద్యోగులకు టార్గెట్ చేస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 3 కోట్లకు ఓ గ్యాంగ్ టోకరా వేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం లెటర్ హెడ్ పై ఫోర్జరీ సంతకంతో పాటు సిఫార్స్ చేసినట్లు ఓ లేటర్ సృష్టించారు. ఒక్క అత్తిలోలోనే 50 మంది నుంచి ఈ విధంగా అక్రమంగా వసూళ్లు చేశారు. ఈ నకిలీ సిఫార్స్ లేఖల అంశం పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతో ఆయన సీరియస్ అయ్యారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కార్యాలయం నుంచి జారీ అయినట్లుగా నకిలీ సిఫార్స్ లేఖలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో  జనసేన యాక్షన్ లోకి దిగింది. ఈ నేపథ్యంలోనే జనసేన హైకండ్ ఆదేశాలతో అత్తిలిలో ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ పేరును దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకోవడంతో పాటు బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కేవలం అధికారిక నోటిఫికేషన్లు, పరీక్షల ద్వారానే జరుగుతుందని జనసేన నాయకులు స్పష్టం చేశారు. నకిలీ సిఫార్సుల లేఖల విషయంలో నిరుద్యోగులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, జనసేన నాయకుల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టెక్నికల్ టీమ్ సాయంతో సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తున్నారు. దీని వెనుక సూత్రధారులు ఎవరు? అనే కోణంలో విచారణ జరుగుతోంది.

Read Also: రేపు చంద్రబాబు పరిస్థితి కూడా అదే! .. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>