కలం, వెబ్ డెస్క్ : స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇన్ స్టాలో చేసిన ఒక లైక్.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. జర్మనీ ఇన్ ఫ్లూయెన్సర్ లిజ్ లాజ్ పెట్టిన పోస్టుకు కోహ్లీ లైక్ కొట్టినట్లు గుర్తించిన అతడి ఫ్యాన్స్.. క్షణాల్లో వైరల్ చేసేశారు. ఆ పోస్టును స్క్రీన్ షాట్ తీసి.. పోస్టులతో ఇన్ స్టాను ముంచెత్తారు. ఎవరీమె.. ఎందుకు కోహ్లీ లైక్ కొట్టాడనే చర్చ కూడా ప్రారంభమైంది. ఇంతలోనే.. కోహ్లీ మళ్లీ అన్ లైక్ చేయడంతో.. దానిపై మీమ్స్ చేస్తున్నారు.
అసలు జరిగిందేంటంటే…?
జర్మనీ ఇన్ ఫ్లూయెన్సర్ లిజ్ లాజ్ తన ఇన్ స్టా అకౌంట్లో పెట్టిన పోస్టుకు కోహ్లీ పొరపాటున లైక్ కొట్టాడు. ఆ విషయం తరువాత గుర్తించి వెంటనే అన్ లైక్ కొట్టాడు. దీనిపై లిజ్ లాజ్ స్పందిస్తూ.. నేను నిద్ర లేచే సమయానికి కోహ్లీ (Virat Kohli) నా పోస్టుకు లైక్ కొట్టాడని తెలిసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నా గురించి స్టోరీస్ కూడా రాసేశారు. చాలా మంది నాకు డీఎం కూడా చేశారు. నిజంగా, నేను కోహ్లీకి తెలుసు కావొచ్చు అనుకున్నా. ఇన్ స్టాలో సపోర్ట్ చేస్తాడనుకున్నా. అయితే, మళ్లీ అన్ లైక్ కొట్టాడని గుర్తించడంతో నిరాశ చెందాను. ఒక్కోసారి అలా జరుగుతుంటుంది. కానీ, నా గురించి అందరూ చర్చించుకోవడం బాగుంది అని చెప్పుకొచ్చింది. గతంలో లిజ్ లాజ్ ఆర్సీబీని సపోర్ట్ చేస్తున్న వీడియో వైరలవుతోంది. కాగా, గతేడాది అవనీత్ కౌర్ అనే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ పెట్టిన పోస్టుకు కోహ్లీ లైక్ కొట్టాడు. ఇది పెద్ద చర్చకు దారి తీయగా.. ఇన్ స్టా ఫీడ్ క్లియర్ చేస్తున్న క్రమంలో పొరపాటు జరిగిందని.. ఇందులో వేరే ఉద్దేశం లేదని విరాట్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
Read Also: సీఎం జోలికి రావొద్దు.. జీవన్ రెడ్డికి మంత్రి అడ్లూరి స్ట్రాంగ్ వార్నింగ్!
Follow Us On: Sharechat

