కండక్టర్‌పై దాడి.. మంత్రి పొన్నం ఆగ్రహం

కలం, కరీంనగర్ బ్యూరో: మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన కండక్టర్ ప్రవళిక (Conductor Pravalika) విధుల్లో ఉండగా ఆమెపై జరిగిన దాడిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. సంబంధించిన వివరాలను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మాట్లాడి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న కండక్టర్‌పై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

దాడులు చేస్తే సహించబోం..

కండక్టర్ ప్రవళికకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులకు సూచించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. సిబ్బందితో ప్రయాణికులు సహృదయంతో వ్యవహరించాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. దాడులు చేయడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>