కలం, స్పోర్ట్స్ : చెన్నై సూపర్ కింగ్స్ ఒకప్పుడు ఐపీఎల్‌లో అన్ని జట్లకు సింహస్వప్నంలా ఉండేది. కానీ ఇప్పుడు వరుస పరాజయాలతో పాయింట్స్ పట్టికలో అడుగున కూర్చుంది. సీఎస్‌కే గేమ్ అంటే ఒకప్పుడు నరాలు తెగే ఉత్కంఠగా అభిమానులు అనుకుంటే.. ఇప్పుడు అదీ ఒక మ్యాచేనా అనే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సామర్థ్యంపై అనేక విమర్శలు, సెటైర్లు వినిపిస్తున్నాయి. తాజాగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు (Ruturaj Gaikwad) చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming) పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రస్తుత సీజన్‌లో గైక్వాడ్ ఇప్పటివరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 63 పరుగులు మాత్రమే చేశారు. కనీసం మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన ఓపెనర్లలో అత్యల్ప సగటు (12.60), స్ట్రైక్ రేట్ (105) రుతురాజ్‌వే కావడం గమనార్హం.
గైక్వాడ్ ఆటతీరుపై స్పందించిన ఫ్లెమింగ్ (Stephen Fleming).. అతను బాగానే ఉన్నాడని, ఆశించిన ఫలితాలు రాకపోయినా కష్టపడుతున్నాడని పేర్కొన్నారు. టీ20 క్రికెట్‌లో ఇలా జరగడం సహజమేనని, ప్రాక్టీస్‌లో అతను బంతిని బాగానే బాదుతున్నాడని వివరించారు. రుతురాజ్ సానుకూల దృక్పథంతో ఉన్నాడని, కేవలం ఒక మంచి ఇన్నింగ్స్ కోసం వేచి చూస్తున్నాడని ఫ్లెమింగ్ తెలిపారు. ఐపీఎల్ లాంటి సుదీర్ఘ టోర్నీల్లో ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం సహజమని ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డారు. రుతురాజ్ నాణ్యమైన ఆటగాడని, జట్టులోని మిగతా ప్లేయర్లు రాణిస్తూ అతనికి మద్దతుగా నిలిస్తే, త్వరలోనే అతను తన ఫామ్‌ను తిరిగి అందుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒకవేళ ఓపెనింగ్ జోడీలో మార్పు అవసరమైతే ఆయుష్ మ्हाత్రే రూపంలో సీఎస్‌కేకు మరో ఆప్షన్ కూడా సిద్ధంగా ఉంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరగనున్న తదుపరి మ్యాచ్ రుతురాజ్ ఫామ్‌లోకి రావడానికి సరైన వేదికగా కనిపిస్తోంది. సాధారణంగా ఇక్కడ బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లు ఉంటాయి. అయితే, గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ యువ బౌలర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ అదరగొట్టడం చెన్నైని కాస్త ఆందోళనకు గురిచేసే అంశం. సంజూ శాంసన్ లాంటి ఆటగాళ్లకు ఇక్కడ మంచి రికార్డు ఉండటంతో, ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో రుతురాజ్ ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా రెండో విడతకు డేట్ ఫిక్స్!
Follow Us On: Sharechat

