కలం, హనుమకొండ: హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ (Hanumakonda BRS) పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌ఛార్జి బోయినపల్లి వినోద్‌కుమార్ సమక్షంలోనే నేతల మధ్య విభేదాలు బయటపడటం చర్చకు దారి తీసింది.
రాకేష్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో దుగ్గింపూడి రంజిత్‌రెడ్డి వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో కొద్దిసేపటి ముందు వరకు కార్యకర్తలతో సందడిగా ఉన్న సభా ప్రాంగణం ఒక్కసారిగా ఖాళీ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం కీలకమైన సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం.

