కలం, సినిమా : వంశీ దొండపాటి డైరెక్షన్ లో ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఇడుపు కాయితం (Idupu Kayitham). ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ డిసెంబర్ 11న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా నుంచి రిలీజైన పాటలోని సన్నివేశాలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. కామెంట్లు, ట్రోల్స్ పై దర్శకుడు వేణు ఉడుగుల (Venu Udugula) స్పందించారు.
తెలంగాణ సంస్కృతిపై విమర్శలపై ఘాటుగా రియాక్ట్ అవుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఒక సమాజపు సంస్కృతిని దాని ప్లేట్లలో, గ్లాసుల్లో వెతకకండి.. చరిత్రలో, శ్రమలో, కళల్లో, పోరాటాల్లో వెతకండి హితవు పలికారు. తెలంగాణను కించపరచడం సులువు కానీ అర్థం చేసుకోవడానికి సంస్కారం, అధ్యయనం కావాలన్నారు. మన జీవితాల్ని, సంస్కృతుల్ని నిజాయితీగా తెరమీదకు తీసుకొచ్చే ఇడుపు కాయితం లాంటి సినిమాలను ఆదరిద్దామని పిలుపునిచ్చారు. సినిమా రిలీజ్ అయ్యాక నచ్చకపోతే విమర్శించండి.. కానీ ఒక ప్రాంతపు అస్తిత్వాన్నిఅజ్ఞానంతో నిర్వచించకండి కోరారు.

