కలం, స్పోర్ట్స్ : రాజస్థాన్ రాయల్స్ గూటిలో మరో ‘కెప్టెన్’ తయారవుతున్నారా? గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధృవ్ జురెల్ చూపిన సమయస్ఫూర్తి చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ప్రస్తుతం రియాన్ పరాగ్ జట్టును సమర్థవంతంగా నడిపిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో లేదా పరాగ్ అందుబాటులో లేని సమయంలో జట్టును ఎవరు ముందుండి నడిపించాలి? అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. అయితే దీనికి 25 ఏళ్ల జురెల్ బెస్ట్ ఆప్షన్ అని మాజీ క్రికెటర్ మోహిత్ శర్మ (Mohit Sharma) అంటున్నారు.
కేవలం 25 ఏళ్ల వయసులోనే జురెల్ ప్రదర్శిస్తున్న గేమ్ అవేర్‌నెస్ చూసి మోహిత్ శర్మ (Mohit Sharma) ఫిదా అయిపోయారు. భవిష్యత్తులో రాజస్థాన్ పగ్గాలు చేపట్టే సత్తా జురెల్‌కు ఉందని ఆయన జోస్యం చెప్పారు. గుజరాత్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 15 పరుగులు కావాలి. క్రీజులో డేంజర్ బ్యాటర్లు రషీద్ ఖాన్, రబడ ఉన్నారు. ఆ సమయంలో కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) ఒక ప్లాన్ అనుకుంటే, జురెల్ మరో మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. 19వ ఓవర్‌ను జోఫ్రా ఆర్చర్‌తో వేయించమని పరాగ్‌కు సూచించారు. జురెల్ మాట విని ఆర్చర్‌కు బంతిని ఇవ్వగా, అతను కేవలం 4 పరుగులు ఇచ్చి మ్యాచ్‌ను రాజస్థాన్ వైపు తిప్పారు. ఆర్చర్ కట్టడి చేయడంతో, చివరి ఓవర్‌లో 11 పరుగులు కాపాడుకోవడం తుషార్ దేశ్‌పాండేకు సులువైంది. కేవలం మైదానంలో సలహాలు ఇవ్వడమే కాదు, బ్యాటింగ్‌లోనూ జురెల్ అదరగొడుతున్నారు. గుజరాత్‌పై 3వ నంబర్‌లో వచ్చి 75 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అందుకే రాజస్థాన్ ఫ్రాంచైజీ ఆయనపై నమ్మకంతో రూ.14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది.
Read Also: ‘తనను తాను ప్రేమించలేని వాడు.. ఇతరులను ప్రేమించలేరు’ ఇందులో వాస్తవం ఎంత?
Follow Us On: Sharechat

