కలం, వెబ్ డెస్క్: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వృషభ’ (Vrushabha) రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా ఈ నెల 25న విడుదల కాబోతున్నది. వృషభ కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సీకే పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మించారు.
సినిమా(Vrushabha)కు విమల్ లహోటి సహ నిర్మాతగా వ్యవహరించారు. నందకిషోర్ దర్శకత్వంలో మలయాళం, తెలుగులో సినిమాను రూపొందించారు. ఇప్పటికే విడుదలైన “వృషభ” టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నది. మోహన్ లాల్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. మోహన్ లాల్, సమర్జీత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, గరుడ రామ్, వినయ్ వర్మ, అలీ, అయప్ప పి.శర్మ, కిషోర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సామ్ సీఎస్, అరియన్ మెహెదీ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.
Read Also: చిరు, వెంకీ సాంగ్ ఎలా ఉంటుందో తెలుసా..?
Follow Us On: Instagram


