epaper
Tuesday, November 18, 2025
epaper

రఫ్ఫాడించిన షమీ.. సెలక్టర్లకు బంతితో బదులు..

టీమిండియా వెటరన్ పేస్ బౌలర్.. సెలక్టర్లకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. షమీ(Mohammed Shami) ఫిట్‌నెస్‌పై అనుమానాలు లేవనెత్తి.. ఆస్ట్రేలియా టూర్‌కు సెలక్ట్ చేయలేదు. దీనిపై తాజాగా స్పందించిన షమీ.. సెలక్టర్లపై విమర్శలు చేశారు. తాను ఫిట్‌గా లేకపోతే రంజీ సిరీస్‌లో ఎలా ఆడతానని ప్రశ్నించాడు. నాలుగు రోజులు జరిగే రంజీలో ఆడగలిగే తాను, వన్డేల్లో ఆడలేనా? అని నిలదీశారు. కాగా బుధవారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో టీమిండియా సెలక్టర్లకు షమీ అదిరిపోయే బదులి ఇచ్చాడు. ఉత్తరాఖండ్‌(Uttarakhand)పై జరిగిన మ్యాచ్‌లో అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో ఇండియా సెలక్టర్లకు తన బంతితోనే సమాధానం ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో షమీ.. మొత్తం 3 వికెట్లు పడగొట్టాడు. వాటిలో రెండు క్లీన్‌బౌల్డ్ కాగా.. ఒకటి క్యాచ్ అయింది. ఈ గేమ్‌లో షమీ చూపించిన ప్రదర్శనతో టీమిండియా సెలక్టర్లపై టీమిండియా ఫ్యాన్స్ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. కుర్రోళ్లకు అవకాశాలు ఇవ్వడం మంచి ఆలోచనే అయినా.. అద్భుతమైన ప్లేయర్స్‌ను పక్కన బెట్టి ఇవ్వడం తప్పని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) కు పాఠాలు చెప్తున్నారు.

అయితే ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్.. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో షమీ(Mohammed Shami)తో పాటు ఇషాన్‌ పోరెల్‌ (15-3-40-3), సూరజ్‌ సింధు జైస్వాల్‌ (19-4-54-4) చెలరేగారు. బెంగాల్ బౌలర్ల దెబ్బకు ఉత్తరాఖండ్‌ 72.5 ఓవర్లలో 213 పరుగులు చేసి చాపచుట్టేసింది. ఉత్తరాఖండ్‌ ఇన్నింగ్స్‌లో భుపేన్‌ లాల్వాని (71)తో రాణించాడు. మిగిలిన ప్లేయర్లలో ఒక్కరు కూడా 30కి మించి పరుగులు చేయలేకపోయారు.

Read Also: నేను వన్డేలు ఎందుకు ఆడకూడదు.. సెలక్టర్లకు షమీ సూటి ప్రశ్న

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>