జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కమలం పార్టీ అద్భుత విజయాన్ని సాధించడం పక్కా అని బీజేపీ అభ్యర్థి లంకల దీపక్(Lankala Deepak Reddy) ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు కూడా గుప్పించారు. బీసీలంటే అంత ప్రేమ ఉన్న కాంగ్రెస్.. ఎందుకు సీఎం పదవి ఇవ్వలేదని నిలదీశారు. ‘‘నాకు టికెట్ ఇచ్చిన బీజేపీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు. జూబ్లీహిల్స్ లో ఇంటింటి ప్రచారం చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తాం. జూబ్లీహిల్స్ లో బీజేపీ విజయం పక్కా. బీసీలపై అంత ప్రేమ ఉంటే సీఎం పదవి ఎందుకు ఇవ్వలేదు. బీసీకి సీఎం పోస్టు ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటా’’ అని స్పష్టం చేశారు.

