Mobile Popup Ad
Mobile Popup Ad

జమిలి ఎన్నికలపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : భారతీయ జనతా పార్టీ (BJP) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ (Modi) వర్చువల్ విధానంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఉమ్మడి పౌరస్మృతి (UCC) , వన్ నేషన్-వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు) అంశాలపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు అంశాలపై తమ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధాని మోదీ వెల్లడించారు.

జమిలి ఎన్నిక నిర్వహణపై క్లారిటీ

వన్ నేషన్-వన్ ఎలెక్షన్ విధానం కింద దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేలా ప్రణాళిక ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరగడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారీగా భారం పడుతోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం అమల్లోకి వస్తే దేశ ఆర్థిక వనరులు ఆదా అవుతాయని.. అలాగే నిరంతరం ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల ఆగిపోయే అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని వివరించారు.

అందరికీ ఒకే చట్టం అమలు

ఉమ్మడి పౌరస్మృతి (UCC)పై కూడా దేశ ప్రజల్లో కూడా సీరియస్ చర్చ జరుగుతుందని ప్రధాని మోదీ చెప్పారు. ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలులోకి వస్తే, మత భేదాలు లేకుండా వివాహం, దత్తత వంటి అంశాల్లో అందరికీ ఒకే విధమైన చట్టం అమల్లోకి వస్తుందని ప్రధాని మోదీ అన్నారు. చట్టం ముందు అందరినీ సమానంగా చూడటం, ముఖ్యంగా అన్ని మతాల్లోని మహిళలకు సమాన హక్కులు కల్పించడం తమ ప్రభుత్వం లక్ష్యమని ప్రధాని వివరించారు.

కార్యకర్తలకు మోదీ సందేశం

బ్రిటిష్ కాలం నాటి వందల సంఖ్యలో ఉన్న పాత చట్టాలను రద్దు చేశామని, ప్రజాస్వామ్య పద్ధతిలో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించామని ప్రధాని (PM Modi) అన్నారు. అలాగే రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (CAA) వంటి చారిత్రాత్మక నిర్ణయాలను తమ ప్రభుత్వం అమలు చేసిందని ప్రధాని గుర్తు చేశారు. ప్రతి సవాలును ఎదుర్కొనేందుకు బీజేపీ కట్టుబడి పనిచేస్తోందని ప్రజలు గుర్తించారన్నారు. అయితే గతంలో కాంగ్రెస్ పాలనలో బీజేపీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని… ముఖ్యంగా హింస రాజకీయ సంస్కృతి వల్ల బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో పలువురు బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు . పార్టీని తల్లిలా భావించే కార్యకర్తల కృషితోనే దేశం అభివృద్ధి పథంలో సాగుతోందని ప్రశంసించారు.

Read Also: సాత్తాన్‌కుళం లాకప్ డెత్ కేసు.. 9 మంది పోలీసులకు మరణశిక్ష

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>