Mobile Popup Ad
Mobile Popup Ad

అమరావతి రైతులకు సీఆర్డీఏ శుభవార్త

కలం, వెబ్ డెస్క్: అమరావతి (Amaravati) రైతులకు సీఆర్డీఏ శుభవార్త చెప్పింది. భూములు తీసుకున్న రైతులకు ఏడాదికి రూ.40 వేల కౌలు చెల్లింపునకు CRDA అథారిటీ ఆమోదం తెలిపింది. పంట భూములకు ఎకరాకు రూ.5 వేలు, మెట్ట భూములకు రూ.3 వేలు చొప్పున ప్రతి ఏడాది పెంపునకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, గ్రామకంఠంలో భూములు కోల్పోయిన వారికి ఏడాదికి రూ.10 వేల ప్రత్యేకంగా సాయం మంజూరు చేయాలని నిర్ణయించింది.

భూములిచ్చిన వారికి రుణమాఫీ..

అమరావతి రాజధాని నిర్మాణానికి 2015లోనే 54 వేల ఎకరాలు సేకరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండో దశ కింద ఏడు గ్రామాల పరిధిలో 20,494 ఎకరాల భూమి తీసుకునేందుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.

ప్రస్తుతం 16,666 ఎకరాల సేకరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో కొత్తగా ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చే రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసేందుకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. 2026, జనవరి ఆరో తేదీ లోపు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తింపజేయాలని నిర్ణయించింది.

రేపటి నుంచే భూ సేకరణ ప్రక్రియ..

ఇనాం భూములను తీసుకుంటున్నందుకు దేవాదాయ శాఖకు రూ.159 కోట్లు చెల్లించేందుకు సీఆర్డీఏ అంగీకరించింది. అలాగే, రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న 25 టౌన్‌షిప్‌లలో ఒక్కో అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు చేయాలని గత సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. వీటికి ఆమోదం తెలిపింది.

సీఆర్డీఏ నిర్ణయాలపై పురపాలక మంత్రి నారాయణ మాట్లాడుతూ.. భూములు ఇవ్వని రైతులకు రేపటి నుంచే భూ సేకరణ ప్రక్రియ అమలు చేస్తామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>