కార్పొరేట్ లుక్‌తో కల్లూరు ఏసీపీ ఆఫీస్!

కలం, ఖమ్మం బ్యూరో: పోలీస్ అధికారులకు మెరుగైన వసతులు, ప్రజలకు త్వరితగతిన సేవలందించడమే లక్ష్యంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ మరో ముందడుగు వేసింది. అందులో భాగంగా శుక్రవారం సత్తుపల్లిలో ఆధునీకరించిన కల్లూరు (Kalluru) అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయాన్ని (ACP Office), జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ముందుగా ​కార్యాలయానికి చేరుకున్న సీపీకి, ఏసీపీ వసుంధర యాదవ్ (Vasundhara Yadav) పుష్పగుచ్ఛంతో సాదరంగా స్వాగతం పలికారు.

అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి సీపీ మీడియాతో మాట్లాడుతూ.. అధికారులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఏసీపీ కార్యాలయాన్ని (Kalluru ACP Office) పునర్నిర్మాణం చేపట్టామన్నారు. ఏసీపీ కార్యాలయాల ఆధునీకరణ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించడం, కేసుల దర్యాప్తును వేగవంతం చేయడం, సైబర్ నేరాల కట్టడికి మరింత కృషి చేయడంతో పాటు, రోడ్డు ప్రమాదాల నిర్మూలన, మాదకద్రవ్యాల కట్టడికి మార్గం సుగమం అవుతుందని వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్ )రామానుజం, ఇన్స్‌పెక్ట‌ర్‌ శ్రీహరి, సీఐ ముత్తులింగం, కల్లూరు డివిజన్ ఎస్సైలు పాల్గొన్నారు.

Read Also: నేను రానో బిడ్డో సర్కార్ దవాఖానాకు.. వరంగల్‌‌లో అందని వైద్యం!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>