‘విజయ్ అనే నేను..’ రేపే సీఎంగా ప్రమాణ స్వీకారం

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) నూతన సీఎంగా విజయ్ (Vijay) రేపు ఉదయం 11 గంట​లకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. ఈ మేరకు, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ టీవీకే పార్టీకి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. విజయ్ కాసేపటి కిందటే గవర్నర్‌ను కలిసి 120 మంది ఎమ్మెల్యే జాబితాను అందించారు. దీంతో వెంటనే అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. మరికాసేపట్లో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మెజార్టీ కంటే ఇద్దరు సభ్యులు అధికంగానే..

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఉండాల్సిన మెజార్టీ సంఖ్య 118. అయితే, విజయ్ (Vijay) పార్టీకి 108 మాత్రమే రావడంతో ఇతర పార్టీల అవసరం ఏర్పడింది. గత మూడు రోజులుగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే సాగుతున్న చర్చలు కొలిక్కి రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చివరి నిమిషంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా టీవీకేకు మద్దతు లభించడంతో మొత్తం మెజార్టీ 120కి చేరింది.

Read Also: మంత్రి పదవులు వద్దన్న సీపీఐ.. కానీ ఒక కండీషన్!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>