కలం, కరీంనగర్ బ్యూరో: బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీల వైఖరి నువ్వు కొట్టినట్టు చెయ్.. నేను అరిచినట్టు చేస్తా అన్న చందంగా ఉందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Komatireddy Narender Reddy) విమర్శించారు. రెండు పార్టీల నాయకులు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకొని, దాడులు చేసుకుని అందులో ఒక పార్టీ బందుకు పిలుపునివ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. పరస్పరం రెండు పార్టీలు అవసరాన్ని బట్టి సహకరించుకుంటూ మళ్లీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డ్రామాను రంజింపచేయడానికి బీఆర్ఎస్ పార్టీ బంద్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తుందని నరేందర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా పునరాలోచించి బంద్ కార్యక్రమాన్ని విరమించుకోవాలని నరేందర్ రెడ్డి సూచించారు.
Read Also: నేను రానో బిడ్డో సర్కార్ దవాఖానాకు.. వరంగల్‌లో అందని వైద్యం!
Follow Us On: WhatsApp

