Mobile Popup Ad
Mobile Popup Ad

ఎండ, వాన ఒకేసారి: వాతావరణ శాఖ కీలక హెచ్చరిక!

కలం, వెబ్‌ డెస్క్ : భారత వాతావరణ శాఖ (Weather Alert) కీలక అప్‌డేట్ ఇచ్చింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ లక్షద్వీప్‌కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించాయి. ఈ నెల 26న కేరళ తీరాన్ని తాకాల్సిన ఇవి కొద్దిగా ఆలస్యంగా కదులుతున్నాయి. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.

మరో రెండు రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకనున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వానలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ, ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు వడగాలుల హెచ్చరికలు జారీ అయ్యాయి. వచ్చే రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈ ఎండ తీవ్రత, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా (Weather Alert) ఉండాలని అధికారులు సూచించారు.

Read Also: రేపు ఈఆర్సీ ముందుకు బీఆర్ఎస్ బృందం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>