హైదరాబాద్‌లో నేపాలీల ఆగడాలు.. యువతి చేయి పట్టి

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో (Hyderabad) నేపాలీల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఇటీవల ఓ ఐపీఎస్ అధికారి భార్య హత్య, మరో ఇంట్లో చోరీకి పాల్పడిన నేపాలీలు.. తాజాగా యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. నిత్యం పోలీస్ అధికారుల సంచారం ఉండే బషీర్‌బాగ్ సీసీఎస్ కార్యాలయం ఎదుటే ఈ ఘటన జరిగింది. సునీల్, ఉమేష్, లక్ష్మణ్, పురుషోత్తం, రామ్ అనే యువకులు స్థానికంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి సీసీఎస్ కార్యాలయం ముందు నుంచి ఒంటరిగా వెళ్తున్న యువతిని వెంబడించి.. చేయి పట్టుకుని లాగారు. ఊహించని పరిణామానికి విస్తపోయిన యువతి, గట్టిగా కేకలు పెట్టడంతో స్థానికులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

నేపాలీలపై కఠిన చర్యలు..?

నేపాలీల కారణంగా హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని అనేక ఘటనలు రుజువు చేస్తున్నాయి. విచిత్ర ప్రవర్తన, నమ్మక ద్రోహం చేసే వైఖరి చాలా ప్రమాదకరమని అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు. వారిని పనిలో పెట్టుకోకపోవడమే మేలని ఏకంగా పోలీస్ అధికారులే బహిరంగంగా ప్రకటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో నేపాలీలపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని పరిశీలకులు చెబుతున్నారు.

Read Also: గుజరాత్‌లో ఎబోలా కేసు కలకలం?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>