కలం, కరీంనగర్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతోందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) అన్నారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇళ్లకు ఆయన గృహప్రవేశం చేయించారు. గొల్లపల్లి గ్రామంలో ఉప సర్పంచ్ ఏక్కల్ దేవి-తిరుపతి గంగరాజులకు, జాబితాపూర్ గ్రామంలో లక్కం జల విజయ్‌లకు మంజూరైన ఇళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఇళ్లను అందిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన చీరలను కానుకగా అందజేశారు. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, సర్పంచ్ ప్రకాష్, మాజీ ఏఎంసీ చైర్మన్లు దామోదర్ రావు, రాధా రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతులకు మద్దతు ధర కల్పించి, దళారుల దోపిడీ నుంచి కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) తెలిపారు. జగిత్యాల పట్టణంలోని 19వ వార్డు శంకులపల్లిలో మెప్మా (MEPMA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ధాన్యం తెచ్చేటప్పుడు రైతులు తేమ శాతం, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. దళారుల ప్రమేయం లేకుండా రైతుల ఖాతాల్లోకి నేరుగా సొమ్ము జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Read Also: రాహుల్ గాంధీకి భారీ ఊరట
Follow Us On: Instagram

