ఆడపిల్ల పుడితే తల్లిని నిందించడం మూర్ఖత్వం: ఎమ్మెల్యే నాగరాజు

కలం, వరంగల్ బ్యూరో : సమాజంలో ఆడపిల్లల పట్ల పెరుగుతున్న వివక్ష, మూఢనమ్మకాలపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు (MLA Nagaraju) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వర్ధన్నపేట (Waradhanapet) నియోజకవర్గ కేంద్రంలో ఐసిడిఎస్ (ICDS) ఆధ్వర్యంలో నిర్వహించిన అంగన్‌వాడీ టీచర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, సమాజంలో ఇంకా కొనసాగుతున్న అన్యాయ భావజాలాన్ని తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు (MLA Nagaraju) మాట్లాడుతూ, బిడ్డ పుట్టుకలో తల్లి పాత్ర కేవలం జన్మనివ్వడమేనని, శాస్త్రీయంగా లింగ నిర్ధారణ పూర్తిగా పురుషుడి క్రోమోజోములపై ఆధారపడి ఉంటుందని వివరించారు. పురుషుడిలోని ‘Y’ క్రోమోజోమ్ కలిసినప్పుడే మగబిడ్డ పుడుతుందని, ఈ ప్రాథమిక అవగాహన లేకుండా ఆడపిల్ల పుడితే తల్లిని బాధ్యురాలిగా చూడటం చాలా దురదృష్టకరమని అన్నారు.

ఇటీవల ఐనోలు మండలంలో ఆడపిల్ల పుట్టిందనే కారణంతో అబార్షన్లు చేయించడం, పుట్టిన బిడ్డను హత్య చేయడం వంటి అమానవీయ ఘటనలను ప్రస్తావిస్తూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మూఢనమ్మకాలు, వివక్షలను సమాజం నుంచి పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ దిశగా అంగన్‌వాడీ టీచర్లు కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీలు, వారి కుటుంబ సభ్యులకు శాస్త్రీయ అవగాహన కల్పించి, ఆడపిల్లల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.

Read Also: ప్లస్సా.. మైనస్సా.. జీవన్‌రెడ్డి పార్టీ మార్పుపై కొత్త చర్చ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>