కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో తీవ్రమైన ఉద్రిక్తలు నెలకొన్న వేళ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ఆయన భేటీ అయ్యారు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ సమావేశం అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో శాంతి చర్చల కోసం అమెరికా (US – Iran) ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌కు చేరుకుంది.
ఈ నేపథ్యంలోనే చర్చలకు ముందు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రాంతీయ భద్రత, ద్వైపాక్షిక సంబంధాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు వంటి అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం అమెరికా బృందం మరికాసేపట్లో ఇరాన్ ప్రతినిధులతో కీలక చర్చలు జరపనుంది.
ఈ చర్చలు రెండు దేశాల (US – Iran) మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా–ఇరాన్ సంబంధాలు పలు అంశాలపై ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో, ఈ శాంతి చర్చలు అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఈ సమావేశాలు భవిష్యత్తులో మధ్యప్రాచ్య రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: ప్లస్సా.. మైనస్సా.. జీవన్‌రెడ్డి పార్టీ మార్పుపై కొత్త చర్చ
Follow Us On: X(Twitter)

