కలం, మెదక్ బ్యూరో : గ్రామాల్లో పూరి గుడిసెలు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా ఇండ్లు లేనివారికి విడతలవారీగా ఎన్ని ఇండ్లయినా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ (Mynampally Rohith) అన్నారు. మెదక్ నియోజకవర్గ పరిధిలోని పాపన్నపేట మండలంలోని పొడిచన్ పల్లి గ్రామంలో 48 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదలు తమ సొంత ఇంట్లో గౌరవప్రదంగా బతకడానికి ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Indlu) మంజూరు చేస్తామని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసుకుంటున్న వారికి బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నామని చెప్పారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 118 కోట్లు లబ్ధిదారుల ఖాతాలో జమచేశామని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలతో పేదల జీవితాల్లో చిరునవ్వులు చూడాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశమని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ (Mynampally Rohith)స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ మాణిక్యం, హౌసింగ్ అధికారులు, స్థానిక సర్పంచ్, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.
Read Also: తెలంగాణకు నేనే హీరో: రేవంత్ రెడ్డి
Follow Us On: Instagram

